ఆదివారం 24 మే 2020
Sports - Feb 20, 2020 , 00:15:03

భారత్‌కు మూడు కాంస్యాలు

 భారత్‌కు మూడు కాంస్యాలు

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు మరో మూడు పతకాలు దక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన టోర్నీ రెండో రోజు పోటీల్లో భారత కుస్తీవీరులు అషు(67కేజీలు), ఆదిత్య కుందు(72కేజీలు), హర్దీప్‌(97కేజీలు) వారి విభాగాల్లో చెరో కాంస్యం చేజిక్కించుకున్నారు. కాంస్యపోరులో అషు 8-1తేడాతో అబ్దుల్‌కరీమ్‌ మహమ్మద్‌ అల్‌హసన్‌(సిరియా)పై అలవోక విజయం సాధించాడు. మరో పోటీలో ఆదిత్య కుందు 8-0తేడాతో నవో కుసాక(జపాన్‌)ను 90సెకన్లలోనే మట్టికరిపించాడు. 


అనంతరం హర్దీప్‌ 3-1తో మఖమ్మద్‌జనోవిచ్‌(కిర్జిస్థాన్‌)పై గెలిచి కాంస్యం దక్కించుకోవడంతో.. గ్రీకోరోమన్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.   మరో రెజ్లర్‌ జ్ఞానేందర్‌(60కేజీలు) కాంస్య బౌట్‌లో 0-6తేడాతో ఓడిపోయాడు. స్టార్‌ రెజ్లర్‌ సునీల్‌ కుమార్‌(87కేజీలు) మంగళవారం గ్రీకోరోమన్‌లో పోటీలో స్వర్ణం సాధించి, 27ఏండ్ల నిరీక్షణకు తెరదించగా... అర్జున్‌ హలకుర్కి(55కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 


logo