ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 06, 2020 , 00:49:42

క్వార్టర్స్‌లో మనీశ్‌, ఆశీష్‌

క్వార్టర్స్‌లో మనీశ్‌, ఆశీష్‌

అమన్‌ (జోర్డాన్‌): భారత బాక్సర్లు మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు), ఆశీష్‌ కుమార్‌ (75 కేజీలు) ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లి.. టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు ఓ విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌ బౌట్లలో మనీశ్‌ 5-0తో చెన్‌ఇన్‌ లై (తైవాన్‌)పై ఏకపక్షంగా గెలువగా.. ఆశీష్‌ 5-0తో ఒముబెక్‌ బెక్జిగిట్‌ఉలు (కిర్గిస్థాన్‌)ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ చిం జోరింగ్‌ బార్తార్సుక్‌ (మంగోలియా)తో మనీ శ్‌, మైకేల్‌ ముష్కిత (ఇండోనేషియా)తో ఆశీ ష్‌ తలపడనున్నారు. ఈ బౌట్లు గెలిచి సెమీస్‌ చేరితే టోక్యో బెర్త్‌ పక్కాకానుంది. 


logo