శనివారం 11 జూలై 2020
Sports - May 31, 2020 , 18:34:08

డింకో సింగ్‌కు కరోనా పాజిటివ్

డింకో సింగ్‌కు కరోనా పాజిటివ్

ఇంఫాల్‌: ఆసియా క్రీడల(1998) స్వర్ణ పతక విజేత, బాక్సర్‌ డింకో సింగ్‌(41)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో మణిపూర్‌లో కరోనా పరీక్ష నిర్వహించారు.  ప్రస్తుతం సింగ్‌ లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.   క్యాన్సర్‌ చికిత్స కోసం ఇటీవల డింకో  ఢిల్లీలో ఉన్నాడు.  2400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి మణిపూర్‌లోని తన ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్‌ కారణంగా రేడియేషన్‌ థెరపీకి దూరమైన డింకోను ఈనెల 25న ఎయిర్‌ అంబులెన్స్‌ సహాయంతో ఢిల్లీకి తీసుకొచ్చారు.  బాక్సింగ్‌లో విశేష ప్రతిభ కనబర్చిన డింకోకు  2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 


logo