దుబాయ్: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో ముగ్గరు బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. మంగళవారం రాత్రి ముగిసిన సెమీస్ బౌట్లలో రోహిత్ చమోలి (48 కిలోలు), భరత్ జూన్ (81 కిలోలు)లు ఫైనల్స్‌కు ప్రవేశించగా మహిళల 46 కిలోల విభాగంలో ముస్కాన్ తుదిపోరుకు సిద్ధమైంది.