మంగళవారం 11 ఆగస్టు 2020
Sports - Jul 09, 2020 , 10:11:39

ఆసియా కప్‌ రద్దు..ఐపీఎల్‌కు లైన్‌క్లియర్‌!

ఆసియా కప్‌ రద్దు..ఐపీఎల్‌కు లైన్‌క్లియర్‌!

ముంబై:  పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో తటస్థ వేదిక యూఏఈలో సెప్టెంబర్‌లో జరగాల్సిన  ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌  రద్దైనట్లు  బీసీసీఐ అధ్యక్షుడు  సౌరభ్‌ గంగూలీ ప్రకటించారు.  బుధవారం తన 48వ పుట్టినరోజు జరుపుకున్న దాదా   స్పోర్ట్స్‌ టాక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో  ఆసియా కప్‌ రద్దు, ఐపీఎల్‌ నిర్వహణ తదితర అంశాలపై    గంగూలీ మాట్లాడాడు.  ఈ ఏడాది పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌  రద్దు విషయాన్ని పాక్‌ కూడా ధ్రువీకరించినట్లు తెలిసింది. 

టీ20 వరల్డ్‌కప్‌,  ఆసియా కప్‌ రద్దు అయితే, ఐపీఎల్‌-2020 సీజన్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది.  ఆసియా కప్‌ రద్దుపై   ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo