గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 26, 2020 , 18:42:19

సందిగ్ధంలో ఆసియా క‌ప్ 2020

సందిగ్ధంలో ఆసియా క‌ప్ 2020

సందిగ్ధంలో ఆసియా క‌ప్ 2020

క‌రాచీ: అంత‌కంత‌కు ప్రమాద‌క‌రంగా మారుతున్న క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆసియాక‌ప్ నిర్వ‌హ‌ణ సందిగ్ధంలో ప‌డింది. కొవిడ్ -19తో ఈ యేడాది జ‌రిగే ఆసియాక‌ప్ టోర్నీ ఆతిథ్యంపై తుది నిర్ణ‌యం తీసుకోకుండానే క్రికెట్ కౌన్సిల్‌(ఏసీసీ) త‌మ స‌మావేశాన్ని వాయిదా వేసింది. అయితే ఐసీసీ భేటీలో ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ సాధ్య‌సాధ్యాల‌పై వీడియా కాన్ప‌రెన్స్ ద్వారా చర్చిస్తామని ఏసీసీ అధికారులు గురువారం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులతో పాకిస్థాన్‌లో ఆడే ప్ర‌స‌క్తే లేద‌ని ఇప్ప‌టికే బీసీసీఐ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌పై ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖ‌రి మాత్రం మ‌రోలా ఉంది. భార‌త్ కాకుండా మిగ‌తా దేశాల‌తో త‌మ సొంత‌గ‌డ్డ‌పై ఆసియా క‌ప్ మ్యాచ్‌లు ఆడిస్తే బాగుంటుంద‌ని పీసీబీ పేర్కొంది. 



logo
>>>>>>