మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 10, 2020 , 23:51:00

సాయిప్రణీత్‌పైనే భారం

సాయిప్రణీత్‌పైనే భారం
  • నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న భారత షట్లర్లు మరో మెగాటోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు బరిలో దిగనుంది. ఈ ఏడాదే ఒలింపిక్స్‌ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్‌ పాయింట్లు పెంచుకోవడంతో పాటు లయ దొరకబుచ్చుకునేందుకు మన వాళ్లకు ఇది చక్కటి అవకాశం. కరోనా వైరస్‌ భయంతో భారత మహిళల జట్టు చాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకోగా.. పురుషుల టీమ్‌ మాత్రమే పోటీలో నిలిచింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ మన జట్టును ముందుండి నడిపించనున్నారు. వీరితో పాటు హెచ్‌ఎస్‌.ప్రణయ్‌, శుభంకర్‌ డే, లక్ష్యసేన్‌ జట్టులో ఉన్నారు. ‘కరోనా’ కారణంగా చైనా, హాంకాంగ్‌ జట్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. ‘డ్రా’ను మార్చారు. ప్రస్తుతం మలేషియా, కజకిస్థాన్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. 

logo