సోమవారం 13 జూలై 2020
Sports - Apr 28, 2020 , 08:24:29

అశ్విన్ యార్క్‌షైర్ ఒప్పందం ర‌ద్దు

అశ్విన్ యార్క్‌షైర్ ఒప్పందం ర‌ద్దు

లండ‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో భార‌త ఆఫ‌స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కౌంటీ కాంట్రాక్ట్ ర‌ద్దైంది. ఇంగ్లండ్ దేశ‌వాళీ క్రికెట్‌లో ఈ ఏడాది యార్క్‌షైర్ క్ల‌బ్‌తో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ‌తంలో అత‌డు వొర్సెస్ట‌ర్ షైర్‌, నాటింగ్‌హ‌మ్ షైర్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

కొవిడ్‌-19 కార‌ణంగా జూలై వ‌ర‌కు త‌మ దేశ‌లంఓ ఎలాంటి క్రికెట్ టోర్న‌మెంట్‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణ‌యించ‌డంతో కౌంటీ సీజ‌న్ వాయిదా ప‌డింది. దీతో ఆట‌గాళ్ల కాంట్రాక్ట్‌లు కూడా ర‌ద్ద‌య్యాయి. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ప్లేయ‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ని.. విప‌త్క‌ర స‌మ‌యంలో ఆట‌లో క‌న్నా ప్రాణాలు ముఖ్యం అని భావించే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని యార్క్‌షైర్ క్రికెట్ డైరెక్ట‌ర్ మార్టీన్ మాక్స‌న్ తెలిపారు. అశ్విన్‌తో పాటు ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, విండీస్ బ్యాట్స్‌మ‌న్ నికోల‌స్ పూర‌న్‌ల ఒప్పందాలు కూడా ర‌ద్దైన‌ట్లు ఆయ‌న తెలిపారు.


logo