ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 02:18:20

పోరాటం ముగిసింది

పోరాటం ముగిసింది

  • సెమీస్‌లో భారత డబుల్స్‌ జోడీల ఓటమి   

బ్యాంకాక్‌: టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో మంచి ప్రదర్శనతో దూసుకెళ్లిన భారత డబుల్స్‌ జోడీలకు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌-అశ్వినీ పొన్నప్ప ద్వయాలు ఓటమి పాలయ్యాయి. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో భారత జోడీ 18-21, 18-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్‌ చియా-సోబ్‌ వూయిక్‌ చేతిలో ఓడింది. 2019లో సూపర్‌-500 గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌-750 టోర్నీ ఫైనల్‌ చేరారు. అయితే ఇప్పుడు తొలిసారి సూపర్‌-1000 టోర్నీ సెమీస్‌కు చేరగా.. ఫైనల్‌ ముంగిట పరాజయం పాలయ్యారు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో 36వ ర్యాంకు జోడీ సాత్విక్‌-పొన్నప్ప 20-22, 21-18, 12-21 తేడాతో టాప్‌ సీడ్‌ థాయ్‌ జోడీ డెచ్‌పోల్‌ పువావర్ననుకో, సాస్పిరీ చేతిలో పోరాడి ఓడింది. తొలి రౌండ్‌ కోల్పోయినా సాత్విక్‌, అశ్వినీ అద్భుతంగా పుంజుకున్నారు. అయితే నిర్ణయాత్మక రౌండ్‌లో వెనుకబడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. కాగా మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో కరోలినా మారిన్‌ 21-19, 21-15 తేడాతో అన్‌సే యంగ్‌ (కొరియా)పై గెలిచి ఫైనల్‌ చేరింది. 

VIDEOS

logo