గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 18:51:42

భజ్జీ రికార్డు బ్రేక్‌ చేసిన అశ్విన్‌

భజ్జీ రికార్డు బ్రేక్‌ చేసిన అశ్విన్‌

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.  ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ను అశ్విన్‌ అధిగమించాడు. రెండో టెస్టు రెండో రోజు ఆటలో బెన్‌స్టోక్స్‌ను ఔట్‌ చేయడం అశ్విన్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. సొంతగడ్డపై అశ్విన్‌ 28.76 సగటుతో 265 వికెట్లు పడగొట్టాడు.

ఓవరాల్‌గా అశ్విన్‌ ఇప్పటి వరకు 76 టెస్టుల్లో 391 వికెట్లు తీశాడు. స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే భారత్‌లో 24.88 సగటుతో 350 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో కుంబ్లే మొత్తం 619 వికెట్లు తీసి భారత లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.  ఈ లిస్టులో హర్భజన్‌ 417 వికెట్లతో  మూడో స్థానంలో ఉండగా.. అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. లెజండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ 434 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

VIDEOS

logo