శనివారం 28 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 22:19:59

IPL 2020: భళా.. అశ్విన్‌

IPL 2020: భళా.. అశ్విన్‌

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో   మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కళ్లు చెదిరే బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు.  తన తొలి ఓవర్‌ మొదటి బంతికే కరుణ్‌ నాయర్‌ను పెవిలియన్‌ పంపిన అశ్విన్‌...ఐదో బంతికి నికోలస్‌ పూరన్‌ను బౌల్డ్‌ చేసి పంజాబ్‌కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లోనే తన సంచలన బౌలింగ్‌తో  ఆకట్టుకున్నాడు. అంతకుముందు మోహిత్‌ శర్మ వేసిన ఓవర్లోనే  కెప్టెన్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్‌ అయ్యాడు.

158 పరుగుల  లక్ష్య ఛేదనలో బరిలో దిగిన పంజాబ్‌ వరుసగా వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 3 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది.