శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 16:38:12

ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన తొలి బౌల‌ర్ అశ్విన్‌

ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన తొలి బౌల‌ర్ అశ్విన్‌

చెన్నై: టెస్ట్ క్రికెట్‌లో గ‌తంలో ఏ బౌల‌ర్‌కూ సాధ్యం కాని ఓ రికార్డును స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు. 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన తొలి బౌల‌ర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట‌లో అశ్విన్ ఈ ఘ‌నత సాధించాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్ .. ఆస్ట్రేలియా మాజీ పేస‌ర్ గ్లెన్ మెక్‌గ్రాత్ స‌ర‌స‌న నిలిచాడు. టెస్ట్ కెరీర్‌లో ఈ ఇద్ద‌రూ 29సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు, అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఆల్‌టైమ్ లిస్ట్‌లో ఇద్ద‌రూ సంయుక్తంగా ఏడోస్థానంలో ఉన్నారు. ఇక అశ్విన్ త‌ర్వాత అత్య‌ధిక మంది లెఫ్ట్ హ్యాండ‌ర్స్‌ను ఔట్ చేసిన వాళ్ల‌లో లంక మాజీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ ఉన్ఆడు. అత‌డు కెరీర్‌లో 191 మంది లెఫ్ట్ హ్యాండ‌ర్స్‌ను ఔట్ చేశాడు. త‌ర్వాతి స్థానంలో ఆండ‌ర్స‌న్ (190), షేన్ వార్న్ (172), మెక్‌గ్రాత్ (172) ఉన్నారు. 

VIDEOS

logo