శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 12:01:45

అగ‌ర్ హ్యాట్రిక్‌.. 107 ర‌న్స్ తేడాతో ఆసీస్ విక్ట‌రీ

అగ‌ర్ హ్యాట్రిక్‌.. 107 ర‌న్స్ తేడాతో ఆసీస్ విక్ట‌రీ

హైద‌రాబాద్‌:  జొహ‌న్న‌స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన తొలి టీ20లో  ద‌క్షిణాఫ్రికాపై 107 ర‌న్స్ తేడాతో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం అయిదు వికెట్లు తీసిన స్పిన్న‌ర్ ఆస్ట‌న్ అగ‌ర్‌.. జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. టీ20 ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండ‌వ ఆసీస్‌ ప్లేయ‌ర్‌గా ఆస్ట‌న్ నిలిచాడు.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 197 ర‌న్స్ చేసింది.  వార్న‌ర్ 4 ప‌రుగుల‌కే ఔటైనా.. రెండవ వికెట్‌కు ఫించ్‌(42), స్మిత్‌(45)లు 80 ర‌న్స్ జోడించారు. ఆ త‌ర్వాత వేడ్‌(18), మిచ‌ల్ మార్ష్‌(19), అలెక్స్ క్యారీ(27), ఆస్ట‌న్ అగ‌ర్‌(20)లు కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా ఓ ద‌శ‌లో 40 ర‌న్స్‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ అగ‌ర్‌.. సౌతాఫ్రికాను మ‌రింత షాక్ ఇచ్చాడు.  డూప్లెసిస్‌, ఫెలుక్వ‌యో, స్టెయిన్‌ల‌ను వ‌రుస‌గా ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.  సౌతాఫ్రికా కేవ‌లం 89 ర‌న్స్ చేసి ఆలౌటైంది. logo