గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 00:16:51

ఆగర్‌ హ్యాట్రిక్‌

ఆగర్‌ హ్యాట్రిక్‌
  • దక్షిణాఫ్రికాపై ఆసీస్‌ ఘనవిజయం

జొహాన్నెస్‌బర్గ్‌: లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ ఆగర్‌ (5/24) హ్యాట్రిక్‌తో రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మొదటి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫించ్‌ (42), స్మిత్‌ (45) రాణించగా.. ఆగర్‌ (9 బంతుల్లో 20 నాటౌట్‌), క్యారీ (27) ధాటిగా ఆడారు.  అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు ఆగర్‌ ధాటికి 14.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. పొట్టి ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాకు పరుగుల పరంగా ఇదే భారీ పరాజయం కావడం గమనార్హం. 8వ ఓవర్‌ చివరి మూడు బంతులకు ఆగర్‌ వరుసగా డుప్లెసిస్‌ (24), ఫెలుక్వాయో (0), స్టెయిన్‌ (0)ను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు.


రాక్‌స్టార్‌ జడేజా నా ఫేవరెట్‌

కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలు నమోదు చేసుకున్న ఆగర్‌.. భారత స్పిన్నర్‌ జడేజా తన అభిమాన ఆటగాడని చెప్పా డు. అతని నుంచి స్ఫూర్తి పొందుతానని.. ఫీల్డ్‌లో జడ్డూ ఓ రాక్‌స్టార్‌లా కనిపిస్తాడని అన్నాడు.


logo