శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 00:03:03

ఫైనల్లో నార్త్‌ఈస్ట్‌

 ఫైనల్లో నార్త్‌ఈస్ట్‌


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో నార్త్‌ఈస్టెర్న్‌ వారియర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో వారియర్స్‌ 3-(-1) తేడాతో చెన్నై సూపర్‌స్టార్స్‌పై సునాయాస విజయం సాధించింది. నార్త్‌ఈస్ట్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి తొలిసారి తుదిపోరుకు చేరితే.. ట్రంప్‌ మ్యాచ్‌లోనూ ఓడిన చెన్నై మైనస్‌లోకి పడిపోయింది. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో బెంగళూరు రాప్టర్స్‌ పుణె సెవెన్‌ ఏసెస్‌ తలపడనున్నాయి.

logo