బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 15, 2020 , 20:05:09

RCB vs KXIP: రెండో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

RCB vs KXIP: రెండో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు

షార్జా: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వేగంగా బ్యాటింగ్‌  చేస్తోంది.   టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌ శుభారంభం అందించారు. పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్వేచ్చగా పరుగులు సాధించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్స్‌ రాబట్టారు. 4 ఓవర్లకు ఆర్‌సీబీ 38/0తో నిలిచింది.  

తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించి జోరుమీదున్న వీరి భాగస్వామ్యాన్ని అర్షదీప్‌ సింగ్‌  విడదీశాడు. అర్షదీప్‌ వేసిన ఐదో ఓవర్‌ మొదటి బంతికే పడిక్కల్(18)‌..పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు ఫోర్లు బాది 11 పరుగులు సాధించాడు.  పవర్‌ప్లేలో  బెంగళూరు వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.  మురుగన్‌ అశ్విన్‌ వేసిన  ఏడో ఓవర్లో  ప్రమాదకర ఫించ్(20)‌ బౌల్డ్‌ అయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ రెండు వికెట్ల  నష్టానికి 63 పరుగులు చేసింది.  కోహ్లీ(17), వాషింగ్టన్‌ సుందర్‌(1) క్రీజులో ఉన్నారు.