ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 23:39:58

శిక్షణ ఏర్పాట్లు భేష్‌

 శిక్షణ ఏర్పాట్లు భేష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగుణంగా సాయ్‌ గోపీచంద్‌ అకాడమీలో జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆదివారం సాయ్‌ అకాడమీని సందర్శించిన మంత్రి..శిబిరం ఏర్పాట్లపై చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌తో మాట్లాడారు. క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్‌, శ్రీకాంత్‌తో కలిసి కొద్దిసేపు సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo