సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 17, 2020 , 08:42:16

ఐపీఎల్‌లో ముంబై తరఫున బరిలో అర్జున్‌ టెండూల్కర్‌?

ఐపీఎల్‌లో ముంబై తరఫున బరిలో అర్జున్‌ టెండూల్కర్‌?

ముంబై : భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ను ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం ముంబై ఇండియన్స్‌ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఓ ఫొటోనే కారణం. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అర్జున్‌ బీసీసీఐ నిబంధనల ప్రకారం.. క్వారంటైన్ పూర్తి చేసుకొని ముంబై జట్టుతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అర్జున్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అర్జున్‌కు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ముంబై ఆటగాళ్లతో కలిసి స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఉన్నారు.

అయితే అందులో ఉన్న వారంతా ఫాస్ట్‌ బౌలర్లు కావడం గమనార్హం. దీంతో సచిన్‌ అభిమానులంతా అర్జున్‌ ఐపీఎల్‌ ఆడబోతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయానికి సంబంధించి ఎంఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన అన్ని జట్లు తమ తమ నెట్స్ బౌలర్లను వెంట తీసుకెళ్లాయి. ఇక అర్జున్ కూడా ముంబై ఇండియన్స్ నెట్స్ బౌలర్లలో ఒకడు. కానీ అతను ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్న లసిత్ మలింగ స్థానంలో ఆడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అర్జున్‌ ఐపీఎల్‌ ఆడుతాడా? లేదా? తెలుసుకోవాలంటే మరో మూడు రోజుల్లో తెలిసిపోనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo