ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్..

ముంబై : ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారు అర్జున్ టెండూల్కర్.. ఇవాళ ముంబై సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆడాడు. ఇప్పటి వరకు అండర్-19 మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. ఇక ఐపీఎల్‌పైన కూడా గురిపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఓ వికెట్ కూడా తీశాడు. ముస్తాక్ అలీ టోర్నీ 20-20 ఫార్మాట్లో జరుగుతోంది. ఈ టోర్నీలో ఇవాళ ముంబై తన మూడవ మ్యాచ్ ఆడింది. టోర్నీ కోసం 20 మంది సభ్యులు ఉన్న జట్టును ప్రకటించారు. దాంట్లో అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. కోవిడ్ నేపథ్యంలో సభ్యుల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ముంబై సీనియర్ జట్టులో అర్జున్‌కు స్థానం ఖరారైంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం అర్జున్‌కు చోటు దక్కలేదు. 21ఏళ్ల అర్జున్ ఇప్పటి వరకు ఏజ్ గ్రూప్ టోర్నీల్లోనే ఆడాడు. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..