బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 18, 2021 , 21:26:51

అర్జున్‌ టెండూల్కర్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌.. ఎంత‌కంటే?

అర్జున్‌ టెండూల్కర్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌.. ఎంత‌కంటే?

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ 2021 వేలం ముగిసింది. వేలం చివరలో సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. 2008 నుంచి 2013 వరకు సచిన్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌, లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అర్జున్‌ టెండూల్కర్‌ పేరు వేలంలో రాగానే ముంబై ఇండియన్స్‌ వెంటనే కనీస ధరకు ఇతడిని కొనుగోలు చేసింది. మరే జట్టు సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అర్జున్‌ ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. 

VIDEOS

logo