శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 16, 2021 , 01:33:26

అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం

అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం

ముంబై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఎలైట్‌ గ్రూప్‌-ఈలో భాగంగా శుక్రవారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ బరిలోకి దిగాడు. చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన అర్జున్‌.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి ఓ వికెట్‌ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై 19.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్‌కాగా.. హర్యానా రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 


VIDEOS

logo