గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 19, 2021 , 20:12:34

అర్జున్ టెండూల్క‌ర్‌ను ఎందుకు ఎంచుకున్నామంటే..!

అర్జున్ టెండూల్క‌ర్‌ను ఎందుకు ఎంచుకున్నామంటే..!

ముంబై: స‌్కిల్స్ ఆధారంగానే అర్జున్ టెండూల్క‌ర్‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకున్నామ‌ని ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నె చెప్పారు. గురువారం చెన్నైలో జ‌రిగిన ఐపీఎల్‌-2021 వేలంలో అర్జున్ టెండూల్క‌ర్‌ను బేస్ ధ‌ర రూ.20 ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియ‌న్స్ ద‌క్కించుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడే అర్జున్ టెండూల్క‌ర్‌. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ (21)కు ఈ టోర్నీ గేమ్ లెర్నింగ్‌కు దోహ‌ద ప‌డుతుంద‌ని శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న అర్జున్ టెండూల్క‌ర్‌ను భారీ ధ‌ర‌కే కొనుగోలు చేయాల్సింద‌న్నారు. అయ‌న బ్యాట్స్‌మ‌న్ కాద‌ని బౌల‌ర్ అని మ‌హేలా జ‌య‌వ‌ర్ద‌నే వ్యాఖ్యానించారు. అర్జున్ టెండూల్క‌ర్‌కు నేర్చుకోవ‌డానికి ఈ టోర్నీ ఉప‌క‌రిస్తుంద‌ని, అయితే, అత‌డిపై తాము ఒత్తిడి తీసుకురాబోమ‌ని, అత‌ని స్టైల్‌లో ఆడేందుకు స్వేచ్ఛ ఉంద‌ని, మెరుగైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించేందుకు కావాల్సినంత టైం ఇస్తామ‌న్నారు. గురువారం జ‌రిగిన వేలంలో ముంబై ఇండియ‌న్స్ ద‌క్కించుకున్న చివ‌రి ఆట‌గాడు అర్జున్ టెండూల్క‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. 2020 ఐపీఎల్ సీజ‌న్‌లోనూ ముంబై నెట్ బౌల‌ర్‌గా అర్జున్ టెండూల్క‌ర్ ఉన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo