సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 06, 2021 , 00:36:11

ఐపీఎల్‌ వేలానికి అర్జున్‌, శ్రీశాంత్‌

ఐపీఎల్‌ వేలానికి అర్జున్‌, శ్రీశాంత్‌

  • మొత్తం 1097 మంది ఆటగాళ్ల నమోదు 

చెన్నై: ఈ నెల 18న జరుగనున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలం కోసం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌, ఏడేండ్ల నిషేధాన్ని ముగించుకున్న పేసర్‌ శ్రీశాంత్‌ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌ దూరమయ్యాడు. వేలం కోసం మొత్తం 1097 మంది ఆటగాళ్లు పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. విదేశాల్లో వెస్టిండీస్‌ నుంచి అత్యధికంగా 56 మంది పోటీలో ఉండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. 207 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు, 863 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు సహా అసోసియేట్‌ దేశాల నుంచి 27 మంది వేలం పోటీలో ఉన్నారు. అందులో భారత్‌ నుంచి 21 మంది ఇంటర్నేషనల్‌ ప్లేయర్లు, 743 మంది దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారు. ‘గరిష్ఠంగా ఒక్కో జట్టులో 25 మంది ప్లేయర్ల్లు ఉండాలి. అందుకే వేలంలో 8 ఫ్రాంచైజీలు కలిపి 61 మంది ఆటగాళ్లను తీసుకోనున్నాయి’ అని ఐపీఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వేలం కోసం అత్యధికంగా పంజాబ్‌ వద్ద రూ.53.20 కోట్లు ఉండగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వద్ద రూ.10.75 కోట్లు మాత్రమే మిగిలాయి. 


VIDEOS

logo