శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 19, 2020 , 01:08:15

ఆర్చరీ సంఘం అధ్యక్షునిగా అర్జున్‌ ముండా

ఆర్చరీ సంఘం అధ్యక్షునిగా అర్జున్‌ ముండా

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ)లో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఢిల్లీ హైకోర్టు మార్గనిర్దేశాలకు అనుగుణంగా శనివారం జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా అధ్యక్షునిగా ఎంపికయ్యారు. ప్రత్యర్థి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీ పాపారావుపై 34-18 ఓట్ల తేడాతో అర్జున్‌ విజయం సాధించారు. నాలుగేండ్ల పాటు ఈ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఏఏఐ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. జనరల్‌ సెక్రెటరీగా ప్రమోద్‌ చంద్రుకర్‌, సీనియర్‌ ఉపాధ్యక్షునిగా కెప్టెన్‌ అభిమన్యు సింధు ఎన్నికయ్యారు. 


logo