రియో డిజనీరో: అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. తాజాగా కోపా అమెరికా కప్‌లో చిలీతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన రేంజ్ ఏంటో చూపించాడు. ఓ ఫ్రీ కిక్‌ను అతడు గోల్‌గా మలచిన తీరు సాకర్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మ్యాచ్ 33వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను 25 గజాల దూరం ఉంచి మెస్సీ గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ఈ స్టన్నింగ్ గోల్‌తో అర్జెంటీనా ఫస్ట్ హాఫ్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది. అయితే మెస్సీ గోల్ ఆ టీమ్‌ను గెలిపించలేకపోయింది. సెకండాఫ్‌లో చిలీ గోల్ చేసి 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది. మ్యాచ్‌లో చాలా వరకూ బాల్ అర్జెంటీనా టీమ్ దగ్గరే ఉన్నా.. తాము అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయామని మెస్సీ అన్నాడు.