ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 21, 2020 , 21:30:09

మీరందరు అడుగుతున్నారు కదా..? ఇదిగో కోహ్లి! ఇంట్లో ఉన్నాడు

మీరందరు అడుగుతున్నారు కదా..? ఇదిగో కోహ్లి! ఇంట్లో ఉన్నాడు

ఈ నెల 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో అన్ని జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఆర్‌సీబీ జట్టు కూడా యూఏఈ వెళ్లగా అందుకు సంబంధించిన ఫొటోలను ఆటగాళ్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే అందులో విరాట్‌ కోహ్లి లేకపోవడంతో అతడి అభిమానులు..  ‘కింగ్ ఎక్కడ’, ‘కోహ్లి కనిపించడం లేదు’, ‘కోహ్లి వీరితో రావడం లేదా’, ‘కోహ్లి ప్రత్యేక విమానంలో వస్తున్నాడా’ అని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ విషయమై స్పందించిన ఆర్‌సీబీ.. ఫ్రాంచైజీ కోహ్లి ఫొటోను షేర్‌ చేసి ‘మీరు అందరూ అడుగుతున్నారు! సో ఇక్కడ మీరు చూడండి.. కెప్టెన్‌ కోహ్లీ ఇంట్లో ఉన్నాడు!’అని ట్వీట్‌ చేసింది. అయితే అంతకుముందు విరాట్‌ తన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘హలో దుబాయ్‌’ అని రాసుకొచ్చాడు. అదే ఫొటోను ఆర్‌సీబీ షేర్‌ చేసింది. దీంతో కోహ్లి మిగతా ఆటగాళ్ల కంటే ముందే యూఏఈ చేరుకున్నాడని అభిమానులు భావిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo