గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 22, 2020 , 22:01:54

RR vs SRH: వార్నర్‌, బెయిర్‌స్టో ఔట్‌..

RR vs SRH: వార్నర్‌, బెయిర్‌స్టో ఔట్‌..

దుబాయ్:‌ రాజస్థాన్‌  రాయల్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  16 పరుగులకే   ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.  ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వార్నర్(4)‌..స్లిప్‌లో బెన్‌స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు. రాజ్‌పుత్‌ వేసిన తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టో(10) ఫోర్‌, సిక్స్‌ బాది 11 పరుగులు రాబట్టాడు. ఆర్చర్‌ వేసిన మూడో ఓవర్లో బెయిర్‌స్టో పెవిలియన్‌ చేరాడు. 149kph వేగంతో వేసిన ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో బౌల్డ్‌  అయ్యాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్‌ పాండే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కార్తీక్‌ త్యాగీ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 11 రన్స్‌ సాధించాడు.   స్టోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి 13 పరుగులు రాబట్టాడు.    త్యాగీ వేసిన ఆరో ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఫోర్‌  కొట్టి 18 పరుగులు రాబట్టడంతో  స్కోరు వేగం పెరిగింది. పవర్‌ప్లే ఆఖరికి సన్‌రైజర్స్‌ 58/2తో నిలిచింది.  పాండే మెరుపులతో ఇన్నింగ్స్‌ గాడిలో పడింది.  మనీశ్‌(39), విజయ్‌ శంకర్‌(2) క్రీజులో ఉన్నారు.