శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 20:35:59

RR vs KKR: శుభ్‌మన్‌ 47 ఔట్‌..

RR vs KKR: శుభ్‌మన్‌  47 ఔట్‌..

దుబాయ్: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో  భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో   కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.  అర్ధశతకం దిశగా సాగుతున్న  యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(47 34 బంతుల్లో 5ఫోర్లు,  సిక్స్‌)  అనూహ్యంగా  పెవిలియన్‌ చేరాడు.  జోఫ్రా ఆర్చర్‌ వేసిన 12వ ఓవర్లో గిల్‌.. రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  అంతకుముందు రాహుల్‌ తెవాటియా వేసిన 10వ ఓవర్లో నితీశ్‌ రాణా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు. 

12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌(0), ఆండ్రూ రస్సెల్‌(2) క్రీజులో ఉన్నారు.  వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకొని ఆఖర్లో విజృంభించాలని  చూస్తున్నారు.  దినేశ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో  జట్టును ఆదుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. రాజస్థాన్‌ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ కేకేఆర్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేస్తూనే ఉన్నారు.