ఆదివారం 05 జూలై 2020
Sports - May 03, 2020 , 01:04:50

కపిల్‌, గవాస్కర్‌ విరాళం

కపిల్‌, గవాస్కర్‌ విరాళం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ఆటగాళ్లకు సాయం చేసేందుకు నిధులను సమీకరిస్తున్న భారత క్రికెటర్ల సంఘానికి(ఐసీఏ) దిగ్గజాలు కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌ విరాళమిచ్చారు. రూ.10లక్షలతో సహాయ నిధిని ఏర్పాటు చేసిన ఐసీఏ ఇప్పటి వరకు రూ.39లక్షల నిధులను సేకరించింది. ‘సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, గుండప్ప విశ్వనాథ్‌, గౌతమ్‌ గంభీర్‌ భాగస్వాములవడంతో మా ప్రయత్నానికి మంచి తోడ్పాటు లభించింది’ అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్ర శనివారం అన్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ కూడా  ఇదివరకే ఐసీఏకు ఆర్థిక సాయం చేశారు. 


logo