సోమవారం 30 నవంబర్ 2020
Sports - Sep 29, 2020 , 11:17:38

గ‌ర్భిణికి ఆ థ్రిల్ అద్భుతం: అనుష్కా శ‌ర్మ‌

గ‌ర్భిణికి ఆ థ్రిల్ అద్భుతం: అనుష్కా శ‌ర్మ‌

హైద‌రాబాద్‌: దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌లో సోమ‌వారం రాత్రి బెంగుళూరు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు ఉత్కంఠ రీతిలో ముంబై ఇండియ‌న్స్ పై విక్ట‌రీ సాధించింది.  సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. అయితే ఆ గెలుపుతో కోహ్లీ భార్య అనుష్కా శ‌ర్మ ఆనందంలో తేలిపోయింది.  ఓ గ‌ర్భిణి మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంత క‌న్నా థ్రిల్లింగ్  ఏముంటుంద‌ని అనుష్కా  కామెంట్ చేసింది.  మ్యాచ్ ముగిసిన త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కా శ‌ర్మ ఈ పోస్టు చేసింది. గ‌ర్భిణి అయిన త‌న‌కు ఆ మ్యాచ్ అమితానందాన్ని ఇచ్చిన‌ట్లు త‌న పోస్టులో అనుష్కా పేర్కొన్న‌ది.  

గ‌త రెండు మ్యాచుల్లో కోహ్లీ విఫ‌లం కావ‌డం వ‌ల్ల అత‌నిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. కామెంటేట‌ర్ గ‌వాస్క‌ర్ చేసిన ఓ కామెంట్ కూడా తీవ్ర దుమారం రేపింది. కోహ్లీ ప‌ర్ఫార్మెన్స్‌పై విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. ఆ  వివాదంలో అనుష్కా శ‌ర్మ కూడా త‌డిసిపోయింది. అయితే తాజాగా ముంబైతో మ్యాచ్‌లో అద్భుత విజ‌యాన్ని కోహ్లీ బృందం విజ‌యం సాధించ‌డంతో అనుష్కా శ‌ర్మ ఆ ఆనందాన్ని త‌ట్టుకోలేక‌పోయింది.  త‌న ఇన్‌స్టా స్టోరీలో విక్ట‌రీ మూమెంట్ ఫోటోతో పాటు బెంగుళూరు స‌భ్యుల ఫోటోల‌ను కూడా పోస్టు చేస్తూ అనుష్కా కామెంట్ చేసింది.