ఆదివారం 17 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 16:32:23

తండ్రైన విరాట్‌ కోహ్లీ

తండ్రైన విరాట్‌ కోహ్లీ

ముంబై: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తండ్రయ్యాడు. కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను కోహ్లీ స్వయంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.  `మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము. 2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ గతేడాది ఆగస్టులో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

'ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని  మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు   ధన్యవాదాలు. అనుష్క,  బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు,  మా జీవితంలో  ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది.   ఈ సమయంలో   మా  ప్రైవసీని మీరంతా  గౌరవిస్తారని  ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్'‌ అంటూ   కోహ్లీ ఓ లేఖను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. 

ఇవి కూడా చ‌ద‌వండి

సిడ్నీ టెస్ట్ డ్రాపై టీమిండియా రియాక్ష‌న్ ఇదీ

ఒక్క డ్రా.. ఎన్నో రికార్డులు

టీమిండియా అసాధార‌ణ పోరాటం.. సిడ్నీ టెస్ట్ డ్రా

సిడ్నీ టెస్ట్‌లో రిష‌బ్ పంత్ అరుదైన రికార్డు

స్టీవ్ స్మిత్ చిల్ల‌ర చేష్ట‌లు.. ఫ్యాన్స్ సీరియ‌స్‌.. వీడియో