శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 00:11:29

సినిమా చూస్తూ నిద్రపోతాడు: అనుష్క

సినిమా చూస్తూ నిద్రపోతాడు: అనుష్క

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చాలాసార్లు సినిమా చూస్తూ మధ్యలోనే నిద్రపోయాడని అతడి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ చెప్పింది. కలిసి సినిమాలు చూస్తున్నప్పుడల్లా అతడు మెలకువతోనే ఉన్నాడా అని గమనిస్తుంటానని తెలిపింది. కోహ్లీ, అనుష్క.. టేక్‌ ఎ బ్రేక్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం ఓ ఆట ఆడారు. తొలుత పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు. క్రికెట్‌ గురించి అనుష్కను కోహ్లీ అడుగగా.. అతడిని సినిమాల గురించి అనుష్క ప్రశ్నించింది. క్రికెట్‌లో మూడు నిబంధనలను చెప్పాలని అనుష్కను కోహ్లీ అడగ్గా.. సమాధానం చెప్పింది. మొదటి హిందీ ఫీచర్‌ సినిమా పేరు కోహ్లీ చెప్పలేకపోవడంతో.. రాజా హరిశ్చంద్ర అని అనుష్క అంది. ఆ తర్వాత ఇరువురు మరిన్ని ప్రశ్నలు సంధించుకున్నారు. అనంతరం అభిమానుల ప్రశ్నలకు వారు బదులిచ్చారు. ఇద్దరూ గొడవ పడినప్పుడు ఎవరూ ముందుగా క్షమాపణ అడుగుతారని ప్రశ్న ఎదురవగా.. తానే అని అనుష్క చెప్పింది.  అనుష్కను సంతోషంగా ఉంచే విషయం ఏంటి అని ఓ అభిమాని అడుగగా.. పెంపుడు జంతువులు అని విరాట్‌ అనగా... ‘కాదు నువ్వే’ అని చెప్పింది. కోహ్లీ ఫోటోలు అసలు బాగా తీయడని అనుష్క చెప్పింది. ఇలా సరదా సమాధానాలతో వీడియో సాగింది. 


logo