శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 15, 2020 , 16:10:22

ఐపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి

 ఐపీఎల్‌లో   ఇదే అత్యంత వేగవంతమైన బంతి

ఐపీఎల్‌-13వ సీజన్‌లో  సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ అన్రిచ్‌  నోర్ట్జే   అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జ్టే  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తిస్తున్నాడు.  అత్యంత వేగవంతమైన బంతులతో ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు.   ఐపీఎల్‌ చరిత్రలోనే  అత్యంత  వేగవంతమైన బంతిని సంధించిన  బౌలర్‌గా    పేసర్  నోర్జ్టే   నిలిచాడు.   బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  నోర్జ్టే  గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా సఫారీ పేసర్‌ నిలిచాడు.  ఈ క్రమంలోనే సౌతాఫ్రికాకు చెందిన సహచర బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ (154.4 kmph)ఫాస్టెస్ట్‌ రికార్డును నోర్ట్జే బ్రేక్‌ చేశాడు.  ప్రతీ మ్యాచ్‌లో  సగటున 150 ప్లస్‌ వేగంతో బంతులేస్తున్నాడు.   ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతులు  రికార్డు   ఇప్పుడు  దక్షిణాఫ్రికా పేసర్ పేరిట ఉన్నాయి.   సీజన్‌ ఆరంభానికి ముందు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ స్థానంలో  నోర్ట్జే అనూహ్యంగా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు.

మొదటి మ్యాచ్‌  నుంచే అద్భుత బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేస్తూ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.  2019లో నోర్జ్టే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో ఉన్నాడు. భుజం గాయంతో తప్పుకోవడంతో అతడు సత్తాచాటే అవకాశాన్ని కోల్పో యాడు.