గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 15, 2020 , 16:15:33

శుభమన్‌గిల్‌ భార్య సచిన్‌ కూతురా? మళ్లీ గూగుల్‌ తప్పులు

శుభమన్‌గిల్‌ భార్య సచిన్‌ కూతురా? మళ్లీ గూగుల్‌ తప్పులు

మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ఖాన్‌ అర్మాన్‌ భార్యగా బాలీవుడ్‌ స్టార్‌ అనుష్కశర్మను చూపించి పప్పులో కాలేసిన గూగుల్‌ సెర్చ్‌.. ఈసారి మరో బ్లండర్‌ చేసింది. క్రికెటర్‌ శుభమన్‌గిల్‌ భార్య ఎవరు? అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. సచిన్‌ టెండూల్కర్‌ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌ అని చూపిస్తున్నది. గతంలో శుభమన్‌గిల్, సారా డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా షికారు చేశాయి.

సారా టెండూల్కర్ ఇటీవల తన 23 వ పుట్టినరోజును జరుపుకుని చాలా మంది నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇదే సమయంలో.. శుభమన్‌గిల్ అగ్రశ్రేణి ప్రదర్శనకు సారా టెండూల్కర్ నుంచి చాలా ప్రశంసలను అందుకున్నాడు. దీంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లుగా ముంబై మీడియా చెవులు కొరికింది. అనేక సందర్భాల్లో సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒకరితో ఒకరు సంభాషించుకోవడం కూడా పలువురు నెటిజెన్లు గుర్తించారు.

21 ఏండ్ల శుభమన్‌గిల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచులో సూర్యకుమార్‌ యాదవ్‌ షాట్‌ను ఆపేందుకు శుభమన్‌గిల్‌ డైవింగ్‌ చేయడాన్ని అభినందిస్తూ ఈ వీడియోను సారా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పంచుకున్నారు. అదేవిధంగా గిల్, సారా ఒకే క్యాప్షన్తో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పంచుకోవడంతో.. ఇది వారి మధ్య సంబంధాల వార్తలను బలపరిచిందని చెప్పుకోవచ్చు. ఇటీవల గిల్ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంలో బ్లాక్‌ హార్ట్‌ ఎమోజీని పోస్ట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపింది. హార్ట్‌ ఎమోజీ పంపినందుకు సారాకు గిల్‌ కృతజ్ఞతలు కూడా తెలిపారు. దీనిని ఎంజాయ్‌ చేస్తూ గిల్‌ను ఆటపట్టించడంలో భాగంగా సారాకు మరో క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా కృతజ్ఞతలు తెలిపారు. వీటన్నింటి కారణంగా సారా టెండూల్కర్ పేరును శుభమన్‌గిల్ సతీమణిగా గూగుల్‌ చూపిస్తున్నట్లు పలువురు నెటిజెన్లు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.