మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 08, 2021 , 08:39:09

శ‌త‌క్కొట్టిన స్టీవ్ స్మిత్‌.. ఆసీస్ 291-7

శ‌త‌క్కొట్టిన స్టీవ్ స్మిత్‌.. ఆసీస్ 291-7

ఆస్ట్రేలియా స్టైలిష్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ( 102; 13 ఫోర్స్‌) ఎట్ట‌కేల‌కు త‌త‌న కెరీర్‌లో 27వ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల‌లో ఘోరంగా విఫ‌లమైన స్మిత్ ఈ మ్యాచ్‌లో తొలి బాల్ నుండే ఆత్మ‌విశ్వాసంతో ఆడుతూ క‌నిపించాడు. దొరికిన బంతిని దొరికిన‌ట్టు బౌండ‌రీకి త‌ర‌లించాడు.ఒక వైపు వికెట్స్ ప‌డుతున్నా కూడా స్మిత్ మాత్రం చాలా ఏకాగ్ర‌త‌తో ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్టాడు.  సొంత మైదానంలో స్మిత్‌ ఫామ్‌లోకి రావడం ఆసీస్‌కు శుభ‌ప‌రిణామంగా మారింది.

మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆసీస్ రెండు వికెట్ల న‌ష్టానికి ‌ 166 ప‌రుగులు చేసింది. ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఆసీస్‌కు జ‌డేజా(3 /46) కోలుకోలేని షాక్ ఇచ్చాడు.మార్నస్‌ లబ్‌షేన్ (91‌; 11ఫోర్లు) , మాథ్యూ వేడ్‌( 13;2 ఫోర్స్), క‌మ్మిన్స్ (0) రూపంలో కీల‌క వికెట్స్ తీసుకున్నాడు. ఇక గ్రీన్( 0), పైనే(1)ల‌ను అద్భుత‌మైన బంతుల‌తో పెవీలీయ‌న్‌కు పంపాడు బుమ్రా. 98 ఓవ‌ర్స్ ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 291 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్స్‌లో జ‌డేజా మూడు వికెట్స్ తీయ‌గా, బుమ్రా రెండు, సైనీ, సిరాజ్‌కు చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక  అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు) అర్ద సెంచ‌రీతో రాణించిన సంగ‌తి తెలిసిందే.