Sports
- Jan 13, 2021 , 15:20:39
నాలుగో టెస్టుకు అశ్విన్ దూరం!

బ్రిస్బేన్ రహానె సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు కోసం సన్నద్ధమవుతోంది. మరోవైపు టీమ్ఇండియాను మాత్రం గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. మూడో టెస్టును డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న అశ్విన్ నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది.
గాయంతో బాధపడుతున్న అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. ఇప్పటికే పేసర్ బుమ్రా కూడా గాయంతో నాలుగు టెస్టుకు దూరమయ్యాడు. మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, టీ నటరాజన్ నలుగురు పేసర్లతో బరిలో దిగాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
తాజావార్తలు
MOST READ
TRENDING