గురువారం 21 జనవరి 2021
Sports - Jan 14, 2021 , 03:41:56

అంకితకు మళ్లీ నిరాశే

అంకితకు మళ్లీ నిరాశే

మెల్‌బోర్న్‌: గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌డ్రాకు అర్హత సాధించాలనుకున్న భారత ప్లేయర్‌ అంకిత రైనాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఆమెకు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అంకిత 2-6, 6-3, 1-6 తేడాతో ఓల్గా డనిలోవిచ్‌ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ వైల్డ్‌కార్డ్‌తో మెయిన్‌ డ్రాలో చోటు దక్కించుకున్నాడు.


logo