ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 00:35:12

అంకిత ముందడుగు

అంకిత ముందడుగు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌ పోటీల్లో భారత టెన్నిస్‌ ప్లేయర్లు అంకితా రైనా, రామ్‌కుమార్‌ రామనాథన్‌ రెండో రౌండ్‌కు చేరారు. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో అంకిత 6-3, 6-2తో హంగేరి ప్లేయర్‌ రెకా లుకాజాను సునాయాసంగా చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రామ్‌ కుమార్‌ 7-6 (8/6), 7-5తో ఫకుడో బగినిస్‌ (అర్జెంటీనా)పై చెమటోడ్చి గెలిచాడు. కాగా భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమీత్‌ నాగల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌డ్రాలో వైల్డ్‌కార్డ్‌ ద్వారా చోటు దక్కించున్నాడు.


logo