సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 02:19:24

ఐటీఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన అంకిత

 ఐటీఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన అంకిత

న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్‌ మహిళ టెన్నిస్‌ ప్లేయర్‌ అంకిత రైనా కెరీర్‌లో తొలి ఐటీఎఫ్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌లోని నోన్త్‌బారిలో జరిగిన టోర్నీ సింగిల్స్‌ ఫైనల్లో రైనా 6-3, 7-5తో చ్లో పక్యుట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. అంతకుముందు శనివారం జరిగిన మహిళల డ బుల్స్‌లో స్కూఫ్స్‌ (నెదర్లాండ్స్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గిన అంకిత సింగిల్స్‌లోనూ అదే జోరు కనబర్చింది. 


logo