గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 23, 2020 , 03:33:26

రౌండో రౌండ్‌లో అంకిత

రౌండో రౌండ్‌లో అంకిత

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనా రెండో రౌండ్‌కు చేరుకోగా.. రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అంకిత 6-4, 4-6, 6-4తేడాతో జొవాన జొవిచ్‌(సెర్బియా)పై రెండు గంటల 47నిమిషాల పాటు పోరాడి గెలిచింది. హోరాహోరీ సాగిన ఈ మ్యాచ్‌లో రైనా 106 పాయింట్లు సాధిస్తే ప్రత్యర్థి 100 దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్‌ 5-7, 2-6తేడాతో వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ ట్రిస్టన్‌ లమాసైన్‌(ఫ్రెంచ్‌) చేతిలో ఓడాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌డ్రాకు చేరాలన్న అతడి లక్ష్యం ఈసారి కూడా నెరవేరలేదు.