బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 20, 2021 , 00:41:54

అంకిత అదుర్స్‌

అంకిత అదుర్స్‌

  • తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ కైవసం

మెల్‌బోర్న్‌: భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అంకితా రైనా కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గింది. రష్యాకు చెందిన తన సహచరి కమిల్లా రఖిమోవాతో కలిసి ఫిలిప్‌ ఐలాండ్‌ మహిళల డబుల్స్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో అంకిత-కమిల్లా జంట 2-6, 6-4, 10-7తో అన్నా బ్లింకోవ-అనస్తాసియ పొటపోవా (రష్యా) ద్వయంపై గెలిచింది. ఈ విజయంతో 5.80 లక్షల నగదుతో పాటు 280 రేటింగ్‌ పాయిం ట్స్‌ ఖాతాలో వేసుకున్న అంకిత.. డబుల్స్‌లో తొలిసారి టాప్‌-100లో అడుగుపెట్టనుంది. వచ్చే వారం విడుదల కానున్న డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అంకిత 94వ ర్యాంక్‌కు చేరనుంది. భారత్‌ తరఫు నుంచి డబుల్స్‌లో సానియా మీర్జా మినహా మరెవరూ టాప్‌-100లో చోటు దక్కించుకోలేకపోయారు. ‘ఈ వారం అద్భుతంగా గడిచింది. కెరీర్‌లో మొదటి డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గడంతో పాటు టాప్‌-100లో అడుగుపెట్టడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని అంకిత చెప్పింది. 

VIDEOS

logo