సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 11, 2021 , 16:26:50

మంచి ప‌ని చేశావ్‌.. జాఫ‌ర్‌కు కుంబ్లే మ‌ద్దతు

మంచి ప‌ని చేశావ్‌.. జాఫ‌ర్‌కు కుంబ్లే మ‌ద్దతు

బెంగ‌ళూరు: ఉత్త‌రాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి వ‌సీమ్ జాఫ‌ర్ రాజీనామా చేయ‌డం స‌రైన‌దే అని అన్నాడు ఇండియ‌న్ టీమ్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత అత‌నిపై మ‌త‌తత్వ వాది ముద్ర కూడా వేసింది ఉత్త‌రాఖండ్ క్రికెట్ అసోసియేష‌న్‌. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను జాఫ‌ర్ తీవ్రంగా ఖండించాడు. ఈ అంశంపై అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. వ‌సీం నా మ‌ద్ద‌తు నీకే.. స‌రైన ప‌నే చేశావు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్లేయ‌ర్స్ నీ కోచింగ్‌ను మిస్ అవుతారు అని ట్వీట్ చేశాడు. 

త‌న రాజీనామాకు గ‌ల కారణాల‌ను జాఫ‌ర్ ఓ ట్వీట్‌లో వివ‌రించాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన మ‌రో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా జాఫ‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు. నువ్వు ఇలా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌రం అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు. 

VIDEOS

logo