శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 00:08:51

ముర్రేకు వైల్డ్‌కార్డ్‌

 ముర్రేకు వైల్డ్‌కార్డ్‌

పారిస్‌: ప్రపం చ మాజీ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే(బ్రిటన్‌)కు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాం డ్‌స్లామ్‌ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌ ద్వారా మెయిన్‌డ్రాకు ప్రవేశం దక్కింది. ఈ ఏడాది యూ ఎస్‌ ఓపెన్‌లోనూ అదే పద్ధతిలో అడుగుపెట్టి ఆండీ రెండో రౌండ్‌లోనే వైదొలిగాడు. గాయాల కారణంగా సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్‌కు దూరంగా ఉన్న ముర్రే ప్రస్తుతం 110వ ర్యాంకులో ఉన్నాడు. కాగా మహిళల విభాగంలో స్వెతేనా పిరంకోవా(బల్గేరియా)కు వైల్డ్‌కాల్డ్‌ దక్కింది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌తో తిరిగి కోర్టులో అడుగుపెట్టిన ఆమె క్వార్టర్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఈ నెల 27న ప్రారంభం కానుంది. 


logo