Sports
- Jan 14, 2021 , 18:25:11
బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కరోనా

లండన్: బ్రిటన్ టెన్నిస్ స్టార్, మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే కరోనా వైరస్ బారినపడ్డాడు. ముర్రేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గురువారం ప్రకటించడంతో రాబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్-2021లో టెన్నిస్ స్టార్ పాల్గొనడం అనుమానంగా మారింది. టోర్నమెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చార్టర్ విమానంలో ముర్రే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు.
ముర్రే ఆరోగ్యంగానే ఉన్నాడని మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్తాడని ప్రెస్ అసోసియేషన్ ఏజెన్సీ తెలిపింది. 33 ఏండ్ల ఆండీ మెల్బోర్న్లో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. సీజన్ ఓపెనింగ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫిబ్రవరి 8 నుంచి ఆరంభంకానుంది.
తాజావార్తలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
MOST READ
TRENDING