శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 14:35:11

లీగ్‌ నుంచి వైదొలిగిన డుప్లెసిస్‌, ఆండ్రీ రస్సెల్‌, మిల్లర్‌

లీగ్‌ నుంచి వైదొలిగిన డుప్లెసిస్‌, ఆండ్రీ రస్సెల్‌, మిల్లర్‌

కొలంబో: శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎస్‌ఎల్‌పీఎల్‌) టీ20 టోర్నమెంట్‌ ఈ ఏడాది  నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 13  వరకు  జరుగనున్న విషయం తెలిసిందే.  లీగ్‌ ఆరంభానికి ముందే పలు ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ తగిలింది.  ఐదుగురు విదేశీ స్టార్‌ ప్లేయర్లు టీ20 లీగ్‌ నుంచి తప్పుకున్నారు. ఫ్రాంఛైజీలు తమను దక్కించుకున్న  వారంలోపే డుప్లెసిస్‌, ఆండ్రీ రస్సెల్‌, డేవిడ్‌ మిల్లర్‌ తదితరులు వైదొలిగారు. 

ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కారణంగా మిల్లర్‌, డుప్లెసిస్‌, డేవిడ్‌ మలన్‌ అందుబాటులో ఉండటం లేదు. వెస్టిండీస్‌ హార్డ్‌హిట్టర్‌ ఆండ్రీ రస్సెల్‌ మోకాలి గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు.  ప్రస్తుతం వీరంతా ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.  భారత వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మన్విందర్‌ బిస్లా కూడా ఎల్‌పీఎల్‌ నుంచి తప్పుకున్నాడు.