శుక్రవారం 10 జూలై 2020
Sports - May 03, 2020 , 15:37:39

‘అప్పటి వరకు కేకేఆర్​​తోనే ఉండాలనుకుంటున్నా’

‘అప్పటి వరకు కేకేఆర్​​తోనే ఉండాలనుకుంటున్నా’

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​) నుంచి రిటైరయ్యే వరకు కోల్​కతా నైట్​రైడర్స్​(కేకేఆర్​) జట్టు తరఫునే ఆడాలనుకుంటున్నానని వెస్టిండీస్​ స్టార్ ఆల్​రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. కేకేఆర్​ ట్విట్టర్ ఖాతా ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో రసెల్ మాట్లాడాడు. “ఇంగ్లీష్ ప్రీమియర్​ లాంటి పెద్ద ఫుట్​బాల్​ లీగ్​లు, ఎన్​బీఏ ఆటగాళ్లలా నేను కూడా ఐపీఎల్​లో రిటైరయ్యే వరకు కేకేఆర్​ జట్టులోనే ఆడాలనుకుంటున్నా. ఇక ఐపీఎల్​కు వీడ్కోలు పలకాలనుకున్నప్పుడు అభిమానులందరికీ గుడ్​బై చెబుతా. ఆ క్షణాల వరకు కోల్​కతాలోనే ఉండేందుకు ఇష్టపడతా. ఆరేండ్లుగా జట్టులో ఉన్నా. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. జట్టు కోసం టైటిల్ గెలిపించాలన్నదే నా లక్ష్యం. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ మేమే గెలుస్తామని నమ్ముతున్నా” అని ఆండ్రీ రసెల్ చెప్పాడు. అలాగే ఐపీఎల్​ నుంచి తప్పుకోవాలనుకున్నప్పుడు కోల్​కతా జట్టు యాజమాని, బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్​తో పాటు ప్లేయర్లు, స్టాఫ్ అందరికీ ‘ఇదే నాకు చివరి ఐపీఎల్​.. కోల్​కతా కోసం ఇదే నా చివరి హోమ్ మ్యాచ్​’ అని చెప్పాలనుకుంటున్నానని రసెల్ తెలిపాడు. గతేడాది ఐపీఎల్​లో 14మ్యాచ్​లు ఆడిన రసెల్.. భీకర హిట్టింగ్​తో​ 510 పరుగులు చేసి సత్తాచాటాడు. అయినా కేకేఆర్​ ప్లేఆఫ్స్​కు కూడా చేరలేకపోయింది. 


logo