ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 21:22:24

ఒకే మ్యాచ్‌లో రెండు స్టన్నింగ్‌ క్యాచ్‌లు:వీడియో

ఒకే మ్యాచ్‌లో రెండు స్టన్నింగ్‌ క్యాచ్‌లు:వీడియో

సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్‌బాష్‌లీగ్‌(బీబీఎల్‌)లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లెచర్‌ అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రూ ఫ్లెచర్‌ హోబర్ట్‌ హరికేన్స్‌తో మ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హరికేన్స్‌ ఇన్నింగ్స్‌లో   ముందుగా

సౌతాఫ్రికా ఆటగాడు  కోలిన్‌ ఇంగ్రామ్‌ కొట్టిన బంతిని వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఫ్లెచర్‌  డైవ్‌ చేసి అందుకోవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. తర్వాత బెన్‌ మెక్‌డెర్మాట్‌ బాదిన బంతి బౌండరీ వెళ్లేలా కనిపించినా బౌండరీలైన్‌ వద్ద బ్రిలియంట్‌ క్యాచ్‌తో అతన్ని కూడా పెవిలియన్‌ పంపాడు ఫ్లెచర్‌. ప్రస్తుతం ఫ్లెచర్‌ పట్టిన రెండు క్యాచ్‌ల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.   


logo