శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 16:04:58

ఆదిలోనే హంస‌పాదు

 ఆదిలోనే హంస‌పాదుషాన్ మ‌సూద్ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్‌


సౌతాంప్ట‌న్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జ‌ట్టులో షాన్ మ‌సూద్ స్థానంలో షాదాబ్ ఖాన్ చోటు ద‌క్కించుకున్నాడు. షాదాబ్ 11 ఏండ్ల త‌ర్వాత టెస్టు జ‌ట్టులోకి రావ‌డం విశేషం. ఇక ఇంగ్లండ్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ జ‌ట్టుకు దూరం కాగా అత‌డి స్థానంలో జాక్ క్రాలీ జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

ఏజెస్ బౌల్ స్టేడియంలో టాస్ గెలిచిన అజ‌హ‌ర్ అలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాతావ‌ర‌ణం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ‌టంతో ఈ నిర్ణ‌యిం తీసుకున్న‌ట్లు చెప్పాడు. అయితే మూడో ఓవ‌ర్‌లోనే పాక్ తొలి వికెట్ కోల్పోయింది. గ‌త మ్యాచ్‌లో సూప‌ర్ సెంచ‌రీతో రెచ్చిపోయిన షాన్ మ‌సూద (1) అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.  logo