శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 22:31:29

టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలిఫాస్టు బౌలర్‌గా అండర్సన్

టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలిఫాస్టు బౌలర్‌గా అండర్సన్

సౌంతాప్టన్‌ : టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ ఫాస్టు బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ సరికొత్త అధ్యయనం లిఖించాడు. పేసర్లలో ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలి ఫాస్టు బౌలర్‌గా అండర్సన్‌ రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన వారంతా స్పిన్నర్లే. శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్‌ (800) వికెట్లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉండగా (708) వికెట్లతో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ రెండోస్థానంలో భారత స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (619) వికెట్లతో మూడో స్థానంలో ఉండగా వీరంతా రిటైరైన వారే. 600 వికెట్లతో అత్యధిక వికెట్ల జాబితాలో అండర్సన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. సౌంతాప్టన్లో గులాబీ బంతితో పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అజార్‌ అలీని అద్భుత బౌన్సర్‌తో వెనుక్కు పంపి ఈ ఘనత సాధించాడు.  అండర్సన్‌ తరువాత  అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్టు బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌కే చెందిన బౌలర్‌ స్టూవర్ట్‌ బ్రాడ్‌ (519) ఉండడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo