ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్

హైదరాబాద్: ఆస్ట్రేలియా టూర్లో అదరగొట్టిన యువ క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. 33 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అరంగేట్ర కుర్రాళ్లకు ఆ లక్కీ ఛాన్స్ దక్కింది. చరిత్రాత్మక రీతిలో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆ ఆరుగురికి థార్ వాహనాలను ఇస్తున్నట్లు మహేంద్ర సంస్థ చైర్మన్ ఆనంద్ మహేంద్ర తెలిపారు. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్, నటరాజన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌లు మహేంద్ర ఎస్‌యూవీలను గెలుచుకున్నవారిలో ఉన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో యువ భారత ఆటగాళ్లు ఇరగదీశారు. గాయాలతో సతమతమైన టీమ్‌ను యంగ్ ప్లేయర్లు ఆదుకున్న తీరు విరోచితం. ఈ ఒక్క సిరీస్‌లోనే ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవాళ వరుస ట్వీట్లలో ఆనంద్ మహేంద్ర మన ఆటగాళ్లను తెగ మెచ్చుకున్నారు. భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా నిలిచారని కీర్తించారు. అసాధ్యాలను సుసాధ్యం చేసే రీతిలో మనోళ్లు ఆడినట్లు మహేంద్ర తన ట్వీట్లో తెలిపారు. అద్భుతం సాధించే దిశలో ఉద్భవించిన నిజమైన కథలని, ఆ ఆటగాళ్లు అందరి జీవితాల్లోనూ ప్రేరణగా నిలిచారని, సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు కొత్త థార్ ఎస్‌యూవీలను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు మహేంద్ర పేర్కొన్నారు. అయితే ఆ వాహనాలను తన స్వంత ఖర్చుల కింద ఇస్తున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ ఖర్చు కిందకు రాదన్నారు. యువతలో విశ్వాసం నింపిన ఆటగాళ్లకు గిఫ్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అత్యధికంగా 13 వికెట్లు తీసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో శార్దూల్, వాషింగ్టన్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Theirs are true ‘Rise’ stories; overcoming daunting odds in the pursuit of excellence. They serve as an inspiration in all arenas of life. It gives me great personal pleasure to gift each of these debutants an All New THAR SUV on my own account—at no expense to the company. (2/3) pic.twitter.com/5aiHSbOAl1
— anand mahindra (@anandmahindra) January 23, 2021
తాజావార్తలు
- గొర్రెలకు హాస్టళ్లు.. ఎక్కడో తెలుసా?
- మహిళపై దాడి కేసు.. వ్యక్తికి మూడేండ్ల జైలు
- బోనస్ ఆశచూపి.. ముంచేస్తారు..
- వెలుగులోకి మరో చైనీయుల కుంభకోణం
- మరో ఇండో-అమెరికన్‌కు కీలక పదవి
- మహిళా పోలీస్ సేవలు భేష్
- అమ్మ లేనిదే ప్రపంచం లేదు.. ఆమె కీర్తి ప్రగతికి స్పూర్తి
- పోర్టర్లకు ఉచిత బస్సుపాసులు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం